బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ నటి రన్యా రావుకు మరో షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది.
Gyanvapi Case : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞాన్‌వాపి కేసులో, మొత్తం కాంప్లెక్స్‌ను సర్వే చేయాలని దాఖలు చేసిన దరఖాస్తు హిందూ పక్షం వాదనల్లో బలం లేకపోవడం కారణంగా కోర్టు తిరస్కరించింది.
తెలంగాణ కేడర్ కావాలని విజ్ఞప్తి చేసిన 11మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కేంద్రం నో చెప్పింది. ఈ 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలోనే రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డీఓపీటీ (DOPT) ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తనకు తెలంగాణ కేడర్ కావాలని కోరింది. దీనిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్ ను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు…
టీమిండియా కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తిరస్కరించాడు. అందుకు గల కారణాలను ఆయన వెల్లడించాడు. నేషనల్ టీమ్‌తో కలిసి సీనియర్ కోచ్‌గా పని చేయాలని ఆసక్తి ఉందని చెప్పాడు.. కానీ ఓ కారణంతో బీసీసీఐ ఆఫర్‌కు నో చెప్పినట్లు రికీ పాంటింగ్ తెలిపాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేమో అన్న ఆలోచనతో కోచ్ పదవిని తిరస్కరించానని చెప్పాడు. ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగమని…
లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీయూ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుకౌట్ నోటీసు జారీ అయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.
ఢిల్లీలో నిర్వహించిన 'ఇండియా కూటమి' సమావేశం ముగిసింది. ఈ నెల 22 న దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. పార్లమెంట్ లో అధికార పార్టీ వ్యవహారానికి నిరసనగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ సమావేశంలో భారత కూటమి ప్రధాని అభ్యర్థిపై చర్చించారు. మల్లిఖార్జున్ ఖర్గే ప్రధానిగా పోటీ చేస్తారా అనే అంశంపై మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను తెచ్చారు. ఈ సమయంలో మమతా బెనర్జీ మల్లికార్జున్ ఖర్గేని ప్రధానమంత్రి అభ్యర్థిగా…