Kushaiguda Police: ఐదుగురు అధికారులపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు..
- ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు..
- ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన ఆ ఐదుగురు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kushaiguda Police: ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన ఆ ఐదుగురు అధికారులపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ హైకోర్టులో వాదించి గత జూలై 24న ఉత్తర్వులు తెచ్చిన విషయం విధితమే. ఇందులో భాగంగా కాప్రా పూర్వపు తహశీల్దార్ ఎస్తేర్ అనిత, పూర్వపు సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి, పూర్వపు కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఈ అంశంపై విచారణ జరిపి, అభియోగ పత్రం దాఖలు చేయాలని కుషాయిగూడ పోలీసులను హైకోర్టు ఆదేశించిన విషయం విధితమే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను న్యాయవాది సుంకర నరేష్ వెల్లడించారు.
Read also: Astrology: సెప్టెంబర్ 04, శనివారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
కాప్రా మండలంలో సర్వే నెంబర్ 199 లోని ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్177లో పట్టా భూమిగా చూపిస్తూ కొంత మంది భూ ఆక్రమణ దారులతో కలిసి అప్పటి కాప్రా మండల తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మండల సర్వేయర్ శ్రీష్మా, రెవిన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు ధ్రువపత్రాలు తయారుచేసి, పూర్వపు రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన లొకేషన్ స్కెచ్స్ మ్యాప్ జారీ చేశారని తెలిపారు. అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసారు. అధికారులు చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను కుషాయిగూడకు చెందిన చప్పిడి కృష్ణారెడ్డి అనే సామాజిక కార్యకర్త పలుమార్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సదరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్దారిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిసిఎల్ఏ కమీషనర్ కు తెలిపారు.
Read also: BCCI: బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో మార్పు.. మాజీ వికెట్ కీపర్ ఎంట్రీ!
ఆ నివేదిక ఆధారంగా కృష్ణారెడ్డి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో అవినీతి అధికారులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయవాది సుంకర నరేష్ ద్వారా మల్కాజిగిరి కోర్టు లో కేసు వేయగా ప్రభుత్వ అధికారుల మీద కేసు నమోదు చేయడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని కింది కోర్టు ఆ కేసును తిరస్కరించింది. దీంతో న్యాయవాది సుంకర నరేష్ కింది కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంగించే విధంగా ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని విధుల్లో నేరానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఎవరి నుండి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. విచారణ చేపట్టి కోర్టులో నేర అభియోగపత్రం దాఖలు చేయాలని హైకోర్టు కుషాయిగూడ పోలీసులను ఆదేశించిందని బాధితుడి తరుపు న్యాయవాది సుంకర నరేష్ తెలిపారు.
Paris Paralympics 2024: టోక్యో రికార్డు బ్రేక్.. పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!