Afghanistan: భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా అఫ్ఘనిస్తాన్ లో ప్రజలు భూకంపాలతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదయింది. అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.49 గంటలకు ఫైజాబాద్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 4.3గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 215 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. ఫైజాబాద్‌కు 185 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంలో జనాలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. గత నెల 26న కూడా ఫైజాబాద్‌లో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
Read also: Disha Patani: వీకెండ్ గిఫ్ట్ గా విజువల్ ట్రీట్…
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 116 కిలోమీటర్ల దూరంలో మంగళవారం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) ఒక ట్వీట్‌లో తెలిపింది. కాగా శనివారం ఉదయం 7.04 గంటలకు మహారాష్ట్రలోని (Maharashtra) హింగోళిలో (Hingoli) భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు మే 3న, రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ఒక ట్వీట్‌లో తెలిపింది. మే 3న మధ్యాహ్నం 3:21 గంటలకు భూకంపం సంభవించిందని, 169 కిలోమీటర్ల లోతులో ఆఫ్ఘనిస్తాన్‌ను తాకినట్లు ఎన్‌సిఎస్ తెలిపింది.