Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించింది. నిందితులందరికి జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్లుగా ఉంటూ ఉగ్రవాదులుగా మారిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తిని కాశ్మీర్‌కు చెందిన ఉమర్ నబీగా గుర్తించారు. నిందితుందరికి ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ నుంచి ఉగ్రవాదిగా మారిన ఉమర్ నబీ దుష్ట పథకం పన్నినట్లు తేలింది. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ 6న దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నాడని అధికారులు తెలిపారు.
Benjamin Netanyahu: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని మరోసారి కలవరపెట్టింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ ఘటనపై ఇజ్రాయిల్ భారత్‌కు మద్దతు తెలిపింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
Delhi Car Blast: ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ మొహమ్మద్‌కు మరో కారు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన దాడికి హ్యుందాయ్ ఐ20 కారను ఉపయోగించాడు. కారులో పేలుడు పదార్థాలు నింపి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇదిలా ఉంటే, అతడికి ఉన్న రెండో కారు కోసం ఢిల్లీ, హర్యానా, యూపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్ కేసులో విచారణ ముమ్మరమైంది. ఈ కేసును ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేతిలోకి తీసుకుంది. పలువురు డాక్టర్ ఉగ్రవాదులతో పాటు మరికొందరిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ బాంబులో ఏ పదార్థం వాడారో తెలుసుకునేందుకు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ బృందం పరీక్షిస్తోంది. ముందుగా, ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ మాత్రమే వాడినట్లు ప్రాథమికంగా అనుకున్నారు. అయితే, ఇదే కాకుండా హైగ్రేడ్ పేలుడు పదార్థాలు…