తెలంగాణలో 13 రోజుల పాటు కులగణన రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కూడా ఆశించిన సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోకుండా మిగిలిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రెండో విడత కుల గణనకు తక్కువ స్పందన వచ్చిందని తెలిపారు.
కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీ సర్వే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమన్నారు బండి సంజయ్. ఎందుకంటే కుల గణన సర్వే అంతా తప్పుల తడక అని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం… తెలంగాణలో 3 కోట్ల 35 లక్షలకుపైగా ఓటర్లున్నారు… అట్లాగే ఓటు హక్కు లేని వారి విషయానికొస్తే…. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల సంఖ్య 60 లక్షలుగా నమోదైందన్నారు. వీరుగాక…
Konda Surekha : సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్ ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలన్నారు కొండా సురేఖ్. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రీ సర్వే అంటున్న కేటీఆర్ తన చెల్లి కవితను చూసి నేర్చుకోవాలన్నారు. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలలో అసంతృప్తి…