Konda Surekha : సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్ ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలన్నారు కొండా సురేఖ్. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రీ సర్వే అంటున్న కేటీఆర్ తన చెల్లి కవితను చూసి నేర్చుకోవాలన్నారు. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది నాకు తెలీదు..నేను ఎవరిని ఎంకరేజ్ చేయడంలేదని, దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది… అడ్మినిస్ట్రేషన్ కు ఇబ్బంది అవుతుందన్నారు. రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదని, లీగల్ లిటికేషన్స్ లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని అదేశించామన్నారు కొండా సురేఖ.
Massive Traffic Jams: ‘‘4 గంటల ప్రయాణానికి 12 గంటల సమయం’’.. కుంభమేళా దారుల్లో ట్రాఫిక్ జామ్..
రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంబాబిషేకాలు చేయాలో లిస్ట్ తియ్యాలని ఆదేశాలు ఇచ్చామని, కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుందన్నారు. ఫారెస్ట్ లో సర్వేయర్ల ప్రొటెక్షన్ పై ఎలాంటి ఫిర్యాదులు లేవని, గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయన్నారు. గత ప్రభుత్వంలో నాయకులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారమని, ఈటల రాజేందర్ పై త్వరలోనే విచారణ జరుగుతుందన్నారు మంత్రి కొండా సురేఖ. బీసీ రిజర్వేషన్ల సర్వేతో మాకు పేరు వస్తదనే బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోందిన ఆమె మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల వ్యాల్యూ ఇప్పుడే అర్థం కాదని, ఉద్యోగాలు, ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రి కొండా సురేఖ.
Dragon Telugu Trailer : లవ్ టుడే హీరో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ట్రైలర్ అదిరింది బాసూ!