Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడగా.. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.