బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రమాదం పూర్తిగా హృదయ విదారకం అన్నారు.
IPL Chairman: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేడియం గేట్ల వద్ద జరిగిన తొక్కిసలాట గురించి లోపల ఉన్న అధికారులకు బయట ఏం జరుగుతుందో తెలియదని అన్నారు.
RCB Stampede: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఆర్సీబీకి ఘన స్వాగతం లభించింది. అయితే, ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో తీవ్ర చోటు చేసుకుంది.
ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏమిటంటే.. ఆర్సీబీ జట్టు అభిమానులు ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా సరైన సమయంలో గేట్లు ఓపెన్ చేయకపోడం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది.
ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచి బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ప్లేయర్స్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమానాశ్రయంలో స్వయంగా కలిసి అభినందనలు చెప్పారు.
నేడు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఇక ఎర్ర సముద్రమే! 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్‌లో భంగపడ్డ ఆర్సీబీ.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో…
తాను ఎప్పుడూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండాలనుకోనని, 20 ఓవర్లు మైదానంలో ఉంటూ ప్రభావం చూపించాలనుకుంటాను అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్లో తాను ఎక్కువ రోజులు ఆడలేనని, తన కెరీర్‌కు ఒక ముగింపు ఉంటుందన్నాడు. తన దృష్టిలో టెస్ట్ క్రికెట్ అత్యుత్తమైందని, ఐపీఎల్ ఐదు స్థాయిలు కిందే ఉంటుందన్నాడు. కుర్రాళ్లు గౌరవం కావాలనుకుంటే టెస్ట్ క్రికెట్‌ను ఎంచుకోవాలని సూచించాడు. ఐపీఎల్ 2025 వేలం తర్వాత చాలా మంది తమ…
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్‌లో భంగపడ్డ ఆర్సీబీ.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో ఫాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. విజయాలు, పరాజయాల్లో ఎన్నో ఏళ్లుగా…
ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అవతరించింది. మంగళవారం అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌లో ముందుగా ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి రన్నరప్‌గా నిలిచింది. చివరి ఓవర్ నుంచే ఆర్సీబీ గెలుపు సంబరాలు మొదలయ్యాయి. ఆర్సీబీ, విరాట్ కోహ్లీ నామస్మరణతో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ విజయం కోసం తన జీవితాన్ని దారపోశా అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ రోజు వస్తుందని తాను అస్సలు అనుకోలేదని, చివరి బంతి వేసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. ఆర్సీబీకి తాను చేయగలిగిందంతా చేశానని, చివరకు ఐపీఎల్ టైటిల్ గెలవడం ఒక అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నాడు. ఈ విజయం జట్టుతో పాటు అభిమానులందరి అని విరాట్ స్పష్టం చేశాడు. మంగళవారం అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో…