CSK Retentions: ఐపీఎల్ సిరీస్‌ను భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ పండుగగా పరిగణిస్తారు. దాదాపు 2 నెలల పాటు సాగే ఈ సిరీస్ తదుపరి సీజన్ (18వ సీజన్) మార్చి 2025లో జరగనుంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే వేడెక్కాయి. దానికి కారణం త్వరలో ఐపీఎల్ జట్టు మెగా వేలం జరగనుండటమే. ఇటీవల విడుదలైన IPL రిటెన్షన్ నిబంధనలు వేలానికి ముందు ప్రతి జట్టు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనే అంచనాలను పెంచాయి. Also Read: SRH…
నేడు (సెప్టెంబర్ 31) ఐపీఎల్ 2025 సంబంధించి అన్ని జట్లకు రిటెన్షన్ ప్లేయర్ల వివరాలు తెలిపేందుకు చివరి తేదీ. నేటి సాయంత్రం ఏఏ జట్టు ఏఏ ఆటగాళ్లను అంటిపెట్టుకొని ఉందన్న విషయం తెలిసిపోతుంది. ఇప్పటికే ఐపీఎల్ లోని వివిధ జట్లు ఏ ఆటగాళ్లను ఉంచుకోవాలో.. ఏ ఆటగాళ్లను వేళానికి వదిలేస్తుందన్న వివరాలు దాదాపు ఒక అంచనాకు వచ్చాయి. ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది మార్చి చివరివారం లేదా.. ఏప్రిల్ మొదటి వారంలో మొదలు కాబోయే ఐపీఎల్…
పుణె టెస్టులో భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. భారత్‌లో కివీస్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 12 ఏళ్లలో 18 సిరీస్‌ల తర్వాత భారత్ సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. స్పిన్ ట్రాక్ పైనే ఆడాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం టీమిండియాకి ఎంతో నష్టాన్ని మిగిల్చింది. మిచెల్ సాంట్నర్ లాంటి స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.
పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. కివీస్ స్పిన్నర్స్ మిచెల్ శాంట్నర్ (4/36), గ్లెన్ ఫిలిప్స్ (2/26) దెబ్బకు టీమిండియా మొదటి సెషన్‌లో ఏకంగా ఆరు వికెట్స్ కోల్పోయింది. క్రీజ్‌లో రవీంద్ర జడేజా (11), వాషింగ్టన్ సుందర్ (2) ఉన్నారు. ఇక జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ఇదరిపైనే ఉంది. భారత్…
India vs Bangladesh Ravindra Jadeja: టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య రెండో టెస్టు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. నాలుగో రోజు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ బౌలర్‌గా నిలిచాడు. టెస్టుల్లో భారత్ తరఫున…
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో రోజురోజుకు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అతను తన పేరిట ఒక పెద్ద రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
Ravichandran Ashwin about Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంటే తనకు అసూయ అని, కానీ అతడిని ఎంతో ఆరాధిస్తాను అని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సహ క్రికెటర్లతో రేసులో ఉన్నప్పుడు వారి కంటే మనమే ముందు ఉండాలని కోరుకోవడం సహజం అని పేర్కొన్నాడు. జడేజాతో తాను ఎప్పటికీ పోటీ పడలేనని తెలిశాక అతడి మీద అభిమానం పెరిందని యాష్ చెప్పాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో…
IND vs BAN Test: భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. శుక్రవారం ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత జట్టు శుక్రవారం ఒక్క గంట ఆటకే పరిమితమైంది. రెండో రోజు రెండో ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజా పెవిలియన్కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా వికెట్ను తస్కిన్ అహ్మద్ తీయగా 86 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర…
Ravindra Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ(బీజేపీలో) చేరారు. సెప్టెంబర్ 02న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని రవీంద్ర జడేజా భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజీ పంచుకున్నారు. రవీంద్ర జడేజా బీజేపీలో చేరినట్లు ఆమె ఫోటోని పోస్ట్ చేశారు.