పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. కివీస్ స్పిన్నర్స్ మిచెల్ శాంట్నర్ (4/36), గ్లెన్ ఫిలిప్స్ (2/26) దెబ్బకు టీమిండియా మొదటి సెషన్‌లో ఏకంగా ఆరు వికెట్స్ కోల్పోయింది. క్రీజ్‌లో రవీంద్ర జడేజా (11), వాషింగ్టన్ సుందర్ (2) ఉన్నారు. ఇక జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ఇదరిపైనే ఉంది. భారత్ ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది.
ఓవర్‌నైట్ స్కోరు 16/1తో రెండోరోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆరంభంలో బాగానే ఆడింది. శుభ్‌మన్ గిల్ (30), యశస్వి జైస్వాల్ (30)లు రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. గిల్‌ను శాంట్నర్ బోల్తా కొట్టించాడు. ఆపై తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. శాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. కాస్పీటికే యశస్వి కూడా ఔటయ్యాడు.
Also Read: Sai Pallavi: బాలీవుడ్‌పై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి!
జట్టును ఆదుకుంటారనుకున్న రిషబ్ పంత్ (18) సర్ఫరాజ్ ఖాన్ (11)లు కూడా తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. పంత్‌ను ఫిలిప్స్, సర్ఫరాజ్‌ను శాంట్నర్ అవుట్ చేశారు. ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (4) ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. దాంతో భారత్ 103 పరుగులకే 7 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఇప్పుడు క్రీజ్‌లో ఉన్న ఆల్‌రౌండర్లు జడేజా -సుందర్‌పైనే భారత ఇన్నింగ్స్ ఆధార పడింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.