టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఊహించని షాక్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన పోస్టులను డిలీట్ చేశాడు. దీంతో.. సీఎస్కేకి జడేజా గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు మరింత బలపడ్డాయి. నిజానికి.. చెన్నై జట్టుకి డెడికేటెడ్‌గా ఉన్న ఆటగాళ్లలో జడేజా ఒకడు. అతడు అత్యంత కీలకమైన ప్లేయర్ కూడా! ఒంటిచేత్తోనే ఆ జట్టుని ఎన్నోసార్లు ముందుకు నడిపించిన సందర్భాలున్నాయి. అలాంటి జడేనా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.
సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడంతో నూతన సారథిగా ఎంపికైన జడేజా.. వరుస ఓటముల కారణంగా ఆ నాయకత్వ ఒత్తిడిని తట్టుకోలేక టోర్నీ మధ్యలోనే తిరిగి ధోనీకే అప్పగించేశాడు. అనంతరం గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు దూరమయ్యాడు. అప్పుడే అతడు చెన్నైకి గుడ్‌బై చెప్పొచ్చన్న పుకార్లు తెరమీదకొచ్చాయి. అప్పుడు వాటిపై క్లారిటీ రాలేదు. ఇప్పుడు సడెన్‌గా జడేజా సీఎస్‌కే పోస్టులను డిలీట్ చేయడంతో.. ఆ రూమర్లకు ఆజ్యం పోసినట్లైంది. మరి, ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే, కొన్నాళ్లు వేచి చూడాల్సిందే! ఒకవేళ జడేజా గుడ్‌బై చెప్పేస్తే.. ఒక కీలకమైన ఆటగాడ్ని చెన్నై జట్టు కోల్పోయినట్టే!
వాస్తవానికి.. రైనాని తీసుకోకకపోవడం వల్లే చెన్నై ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిందన్న వాదనలు వినిపించాయి. ఒకవేళ రైనా ఉండుంటే, ఫలితాలు మరోలా ఉండేవని మాజీలు సైతం తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇలాంటప్పుడు జడేజాని కూడా పక్కనపెట్టేస్తే.. సీఎస్కే పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. కాగా.. గాయం నుంచి కోలుకున్న జడేజా తిరిగి ఇంగ్లండ్‌తో టెస్టుకు భారత జట్టులో చేరాడు. ఈ టెస్టులో జడేజా అద్బుతమైన సెంచరీ సాధించాడు. జడేజా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టులో భాగంగా ఉన్నాడు.