(జూలై 14న రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు)దర్శకునిగా రవిరాజా పినిశెట్టి తనదైన బాణీ పలికించారు. వి.మధుసూదన రావు తరువాత ‘రీమేక్స్’లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే. ఆయన తండ్రి పినిశెట్టి రామ్మూర్తి అనేక తెలుగు చిత్రాలకు రచన చేశారు. రవిరాజా పినిశెట్టి మనసు కూడా తొలి నుంచీ సినిమాలవైపే సాగింది. దాంతో చదువు పూర్తయ్యాక దాసరి నారాయణరావు వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు రవిరాజా. తరువాత మాదాల రంగారావు హీరోగా రూపొందిన ‘వీరభద్రుడు’ చిత్రంతో దర్శకుడయ్యారు. రెండో…