రీమేక్స్ లో కింగ్… రవిరాజా పినిశెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 14న రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు)
దర్శకునిగా రవిరాజా పినిశెట్టి తనదైన బాణీ పలికించారు. వి.మధుసూదన రావు తరువాత ‘రీమేక్స్’లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే. ఆయన తండ్రి పినిశెట్టి రామ్మూర్తి అనేక తెలుగు చిత్రాలకు రచన చేశారు. రవిరాజా పినిశెట్టి మనసు కూడా తొలి నుంచీ సినిమాలవైపే సాగింది. దాంతో చదువు పూర్తయ్యాక దాసరి నారాయణరావు వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు రవిరాజా. తరువాత మాదాల రంగారావు హీరోగా రూపొందిన ‘వీరభద్రుడు’ చిత్రంతో దర్శకుడయ్యారు. రెండో సినిమా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ‘జ్వాల’. ఆ తరువాత ‘అవల్ సుమంగళిదాన్’ చిత్రాన్ని తెలుగులో ‘పుణ్యస్త్రీ’గా తెరకెక్కించారు. ఈ సినిమాతో రవిరాజాకు మంచి గుర్తింపు లభించింది. ‘జ్ఞాన ఒలి’ రీమేక్ గా చిరంజీవి, మోహన్ బాబుతో తెరకెక్కిన ‘చక్రవర్తి’కి కూడా రవిరాజా దర్శకత్వం వహించారు. ఆయన పలు రీమేక్స్ తీసినా, రవిరాజాను స్టార్ డైరెక్టర్ గా మార్చింది చిరంజీవి ‘యముడికి మొగుడు’ అనే చెప్పాలి. ఆ సినిమా తరువాత రవిరాజా తీరే మారింది.
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అంకుశం’ చిత్రాన్ని హిందీలో చిరంజీవితో ‘ప్రతిబంధ్’గా రీమేక్ చేశారు. ఆ సినిమా ద్వారా హిందీ సినిమా రంగంలో అడుగుపెట్టారు రవిరాజా. యండమూరి వీరేంద్రనాథ్ ‘థ్రిల్లర్’ నవలను ‘ముత్యమంత ముద్దు’గా రూపొందించారు. అలాగే మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘యమపాశం’ నవలను అదే పేరుతో తెరకెక్కించారు రవిరాజా. తమిళ ‘మైడియర్ మార్తాండన్’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో ‘రాజా విక్రమార్క’గా రూపొందించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘చిన్నతంబి’ని వెంకటేశ్ హీరోగా ‘చంటి’ పేరుతో రవిరాజా దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. తెలుగులో ఘన విజయం సాధించిన ‘గ్యాంగ్ లీడర్’ను హిందీలో రవిరాజా ‘ఆజ్ కా గూండా రాజ్’ పేరుతో రీమేక్ చేయగా, చిరంజీవి నటన అక్కడి వారినీ ఆకట్టుకొనేలా ఆ సినిమాను రూపొందించారు. తరువాత “బలరామకృష్ణులు, కొండపల్లి రాజా” వంటి రీమేక్స్ తో అలరించిన రవిరాజా, బాలకృష్ణతో ‘బంగారుబుల్లోడు’ తెరకెక్కించి అనూహ్య విజయం సాధించారు. అయినా రీమేక్స్ పైనే దృష్టి సారించి, “ఎమ్.ధర్మరాజు ఎమ్.ఏ, ఎస్పీ పరశురామ్, పెదరాయుడు” వంటి చిత్రాలను రూపొందించారు. వీటిలో ‘పెదరాయుడు’ సంచలన విజయం సాధించింది. ఆపై కొన్ని స్ట్రెయిట్ మూవీస్ తీసినా, రవిరాజా దర్శకత్వంలో “రాయుడు, అల్లుడుగారు వచ్చారు, రుక్మిణి, మా అన్నయ్య, శుభకార్యం, అధిపతి, మా బాపూ బొమ్మకు పెళ్ళంట, వీడే, అందమైన అబద్ధం” వంటి రీమేక్స్ తోనే సాగారు. వీటిలో ‘మా అన్నయ్య’ మంచి విజయం సాధించింది.
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
రవిరాజా పినిశెట్టి తనయులు ఇద్దరు కూడా చిత్రసీమలోనే ఉన్నారు. పెద్ద కొడుకు సత్యప్రభాస్ తండ్రి బాటలోనే పయనిస్తూ దర్శకుడుగా మారారు. చిన్నకొడుకు ఆది పినిశెట్టి హీరోగానూ, విలన్ గానూ, కేరెక్టర్ యాక్టర్ గానూ మెప్పిస్తున్నారు. తనయుల చిత్రసీమ ప్రయాణాన్ని చూస్తూ రవిరాజా పినిశెట్టి పుత్రోత్సాహంలో ఉన్నారు. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!