Mallikarjun Kharge: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను దేశంలో నిషేధించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయడాన్ని నిషేధించాలని అన్నారని ఖర్గే గుర్తు చేశారు. 2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, దానిని తిరిగి అమలు చేయాలని కోరారు. ‘‘ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని ఖర్గే శుక్రవారం అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆయన విషంతో పోల్చారు
CP Sajjanar: సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంచి సమాజ నిర్మాణం కోసం యువత పాటు పడాలన్నారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ ఐక్యత దినోత్సవం) జాతీయ ఐక్యత కోసం 5K RUN కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫెక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని స్పష్టం చేశారు. డీప్ ఫెక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టామన్నారు..…
PM Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈ సారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు…