రశ్మిక సౌత్ నుంచీ నార్త్ వైపు రాకెట్ లా దూసుకుపోతోంది. కన్నడలో మొదలైన ఈ బెంగుళూరు బ్యూటీ పయనం ఇప్పుడు తెలుగు, తమిళం మీదుగా హిందీకి చేరింది. తమిళంలో కార్తి, తెలుగులో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన మిస్ మందణ్ణా బాలీవుడ్ లోనూ క్రేజీ ఆఫర్లే కొట్టేస్తోంది. ఓ వీడియో సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు ‘సరిలేరు నాకెవ్వరూ’ అన్నట్టుగా సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది! రశ్మిక శాండల్…
లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు.. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్తో ఓ సినిమా, సిద్ధార్త్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిషన్ మంజు’ అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇదిలావుంటే, కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన రష్మిక.. ఈ సినిమా హిందీ రీమేక్ కోసం ఆమెను…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 లాంటి విభిన్నమైన ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ రెండో భాగానికి ఓ ప్రత్యేకమైన టైటిల్ను పెట్టాలని చిత్రబృందం ఆలోచిస్తుందని తెలిసింది. త్వరలోనే కొత్త పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారట. కరోనా…
కన్నడ బ్యూటీ రష్మీక మందాన ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్. అయితే రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. అయితే ఆ మధ్య “ఈ సాలా కప్ నమ్దే” అంటూ సొంత రాష్ట్రానికి చెందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తనను ఇష్టమైన జట్టు అని తెలిపింది. దాంతో రష్మీక ఫేవరేట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనే అనుకున్నారంత. కానీ తాజాగా సోషల్ మీడియా వేదికగా నా ఫెవరేట్ క్రికెటర్ ”మహేంద్ర సింగ్ ధోనీ ”…
దక్షిణాదిన అగ్రతారల్లో ఒకరిగా రాణిస్తున్న రశ్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. నిజానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమా వల్లే రశ్మికకు బాలీవుడ్ ఛాన్స్ లభించిందట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు రశ్మికను ‘మిషన్ మంజు’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్న దర్శకుడు శాంతన భాగ్చీ. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడుతూ ‘డియర్ కామ్రేడ్’లో రశ్మిక నటనను చూసి ఇంప్రెస్ అయ్యాను. నిజానికి మా సినిమాలో అమాకత్వం, అందం ఉన్న నటి…
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా బిజీగా మారిపోయిన రష్మిక మందన్న ఈ కరోనా కాలంలో తరచుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి వారి సందేహాలను తీరుస్తోంది. అందులో భాగంగా తాజాగా అభిమానులతో ముచ్చటించిన రష్మిక సరైన స్క్రిప్ట్, సమర్థుడైన దర్శకుడు దొరికితే మళ్ళీ విజయ్ దేవరకొండతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన అభిమాన ఐపిఎల్ జట్టు అని రష్మిక అన్నారు.…
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘సుల్తాన్’. ఈ ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నెపోలియన్, లాల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. వివేక్ – మెర్విన్ సంగీతం అందించగా… ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా ‘సుల్తాన్’ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు…
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్’కు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఈ మూవీని నిర్మించారు. ప్రేక్షకుల నుంచి విభిన్న రెస్పాన్స్ ను రాబట్టుకున్న ‘సుల్తాన్’ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు ఓటిటి వేదిక…
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ సూపర్ హిట్. అందులో ‘మైండ్ బ్లాక్’ సాంగ్ స్పెషల్ నంబర్ అని చెప్పాలి. మహేశ్ తో లుంగీ కట్టించి మరీ ఈ సాంగ్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ ఇప్పించాడు. అలానే రష్మికా మండణ్ణ సూపర్ మాస్ స్టెప్టులతో అలరించింది. సెట్స్ సైతం కనుల విందుగా…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫోటోలు గత రెండు రోజులుగా నెట్టింట వైరల్గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రష్మిక డై హార్ట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమిళనాడులోని కొన్ని సెలూన్ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్న…