కన్నడ సోయగం రష్మిక మండన్న ఇటీవలకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. కొన్ని రోజుల క్రితం తన పెంపుడు జంతువు ఆరాతో కలిసి దిగిన పిక్స్ ను రశ్మిక షేర్ చేయగా, అవి వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మారు తన అందమైన పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. “సంథింగ్ అబౌట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్” అనే శీర్షికతో రష్మిక షేర్…
‘సరిలేరు నాకెవ్వరు’ అంటూ సాగిపోతోంది ‘భీష్మ’ బ్యూటీ రశ్మిక మందణ్ణా. కన్నడలో మొదలైన ఆమె ప్రస్థానం తెలుగులో సూపర్ హిట్ చిత్రాలతో సాగింది. దాంతో స్టార్ గా ఎదిగిన ‘ఛలో’ బ్యూటీ ‘ఛలో ఛలో’ అంటూ కోలీవుడ్ లో కాలుమోపింది. కార్తీతో ‘సుల్తాన్’లో నటించింది సుకుమారి. అయితే, కన్నడ, తెలుగు, తమిళంతో ఆగాక మన అందాల తుఫాను ముంబైని కూడా తాకింది. రశ్మిక ఇప్పుడు ముంబైలో మకాం వేసి హిందీ సినిమాలు చక్కబెడుతోంది! ఆల్రెడీ ‘టాప్ టక్కర్’…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతోంది “పుష్ప” టీం. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరగనుందట. జూలై 5న ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు 30 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే సుకుమార్ లొకేషన్లను కూడా ఫిక్స్ చేశారట. ఈ అందమైన గోవా లొకేషన్లు సినిమాలో ప్రేక్షకులకు కన్నుల విందు చేయనున్నాయి.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ బన్నీని గతంలో ఎన్నడూ చూడని విధంగా కళ్ళు చెదిరే సీన్స్ ప్లాన్ చేశారని, ఇందుకోసం సుకుమార్ తన క్రియేటివిటీకి పదును పెట్టారని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు సుకుమార్. పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, కరోనా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ జులై నుంచి జెట్ స్పీడ్ లో జరగనుందట. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. దర్శకుడు సుకుమార్ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేయాలని భావిస్తున్నాడట. షూటింగ్ పునప్రారంభించిన వెంటనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ…
టాలీవుడ్ హీరో నితిన్, రష్మిక మందన హీరో హీరోయిన్స్‌గా దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో ‘భీష్మ’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు నితిన్-రష్మిక కాంబినేషన్ మరోసారి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమాతో బిజీగా ఉండగా.. రష్మిక పుష్ప సినిమాతో బిజీగా వుంది. ఈ సినిమాల తరువాత వీరిద్దరూ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయని…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన ‘డియర్ కామ్రేడ్’ జూలై 26, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను తీసినా, ఒకేసారి తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. లవ్, పెయిన్, ఎమోషన్స్, యాంగర్… ఈ నాలుగింటి సమ్మిళితంగా ‘డియర్ కామ్రేడ్’ మూవీ తెరకెక్కింది. అయితే… అప్పట్లో అనివార్య కారణాల వల్ల హిందీ వెర్షన్ విడుదల కాలేదు. దాంతో 2020 జనవరి 19న ‘డియర్ కామ్రేడ్’…
కన్నడ భామ రష్మిక మందన్న సౌత్ తో పాటు నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో “గుడ్‌బై” చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సూపర్ 30’ ఫేమ్ వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు.…
ఆమె ఛార్మి. ఈమేమో ఛార్మింగ్ బ్యూటీ. ఇద్దరి చేతుల్లో చూడ చక్కని పెట్ డాగ్స్! ఇంతకీ, ఈ సీన్ ఎక్కడా అంటారా? ముంబైలో! ఛార్మి కౌర్, రశ్మిక మందణ్ణ ఎదురు పడ్డారు. సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, చుట్టూ ఉన్న వార్ని ఆకర్షించింది, కెమెరాల్ని ఉత్సాహపరిచింది మాత్రం ఈ బ్యూటీస్ ఇద్దరి చేతుల్లోని క్యూటీసే! ఛార్మి చేతుల్లో ఆమె తెల్లటి పెంపుడు కుక్క ఉండగా… రశ్మిక చేతుల్లో తన న్యూ బ్రౌనీ పెట్ కనిపించింది…సినిమా హీరోయిన్స్ కి పెట్…
కన్నడ సోయగం రష్మిక మండన్న షూటింగ్ కోసం తిరిగి ముంబై చేరుకుంది. కరోనా వ్యాప్తి తగ్గడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులను ప్రకటించింది. దీంతో బాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ సినిమాల షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ “గుడ్‌బై” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి రష్మిక మండన్న ఈరోజు ముంబైలో అడుగుపెట్టింది. “గుడ్‌బై” చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్…