కన్నడ సోయగం రష్మిక మండన్న ఇటీవలకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. కొన్ని రోజుల క్రితం తన పెంపుడు జంతువు ఆరాతో కలిసి దిగిన పిక్స్ ను రశ్మిక షేర్ చేయగా, అవి వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మారు తన అందమైన పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. “సంథింగ్ అబౌట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్” అనే శీర్షికతో రష్మిక షేర్ చేసిన మోనోక్రోమ్ పిక్ ఆమె అభిమానులను అట్ట్రాక్ట్ చేస్తోంది. ఈ పిక్ ను భారీ సంఖ్యలు లైకులు, షేర్లు లభిస్తున్నాయి.
Read Also : ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ కు తండ్రిగా బాలీవుడ్ హీరో ?
కాగా ఈ వారం ప్రారంభంలో కర్ణాటకలో ఆమెను కలవడానికి ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ. నడిచి రావడం చర్చకు దారి తీసిన విషయం విదితమే. ఇక ఇలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ను లెక్కలేనంత మందిని కూడగట్టుకున్న రష్మిక బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. అందుకే ఇటీవల ముంబైలోని కొత్త అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన రష్మిక మండన్న తన అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్‌లో పలకరించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన “పుష్ప” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు ముంబైలో ‘గుడ్ బై’ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు సిధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’ సినిమా సినిమాలో కూడా కనిపించనుంది. ఈ భామ తెలుగులో ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ చేస్తోంది. ఈ రోమ్-కామ్ మూవీలో హీరోగా శర్వానంద్ నటించారు.