Home
Rashmika Mandanna
Rashmika Mandanna News
-
Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) జోడీని టార్గెట్ చేస్తూ నెట్టింట సాగుతున్న అసత్య ప్రచారాలపై ఎట్టకేలకు చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరి వ్యక్తిగత జీవితంపై లేనిపోని కట్టుకథలు అల్లుతూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై విరోష్ టీమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హద్దులు దాటి ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. విజయ్ దేవరకొండ,… -
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
Tollywood: టాలీవుడ్లో ప్రమోషన్ల రూట్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా పూర్తవగానే ప్రెస్‌మీట్ పెట్టేవాళ్లు.. రిలీజ్‌కు ముందు ఆడియో ఫంక్షన్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి నాలుగు డైలాగులు కొట్టి చేతులు దులుపుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కొత్తగా ‘ఫ్యాన్స్ మీట్’ల పేరుతో సరికొత్త కల్చర్ మొదలైంది. సినిమా థియేటర్లలోకి రావడానికి నాలుగైదు రోజుల ముందు హడావుడిగా వేలాది మందిని పిలిపించి.. వరుసగా నిలబెట్టి ఫోటోలు దిగడమే ఇప్పుడు టాలీవుడ్లో నయా ట్రెండ్‌గా మారింది. అయితే… -
Rashmika Mandanna : “అవును.. అతనంటే నాకు పిచ్చి!” : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
గత కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిలేషన్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు ఎట్టకేలకు రష్మిక స్వయంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో వచ్చిన ప్రస్తావనను వక్రీకరిస్తూ నెటిజన్లు గుప్పిస్తున్న విమర్శలు, సలహాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన లేఖను పంచుకున్నారు. నెట్టింట కొందరు వ్యక్తులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు నిర్మాణాత్మకంగా కాకుండా, ఒక ‘ఆగ్రహంతో కూడిన గుంపు’లా మారి దాడి చేస్తున్న తీరును ఆమె తీవ్రంగా… -
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
సినిమా రంగంలో హీరోయిన్ల ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హద్దులు, తెరపై పాత్రల రూపురేఖలు, వేసే దుస్తుల విషయంలో హీరోయిన్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాత, టాక్ షో హోస్ట్ కరణ్ జోహార్‌తో జరిగిన ఓ ముఖాముఖిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్ పరిమితులు, గ్లామర్ షోపై స్పష్టమైన, నిర్మొహమాటమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ది సినిమాలో జాన్వీ కపూర్… -
Ranabaali : బుకింగ్స్‌తో సత్తా చాటుతున్న ‘రణబాలి’.. విరోష్’కు స్పెషల్ మైల్ స్టోన్!
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన హ్యాట్రిక్ మూవీ ‘రణబాలి’. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా విజయ్ చేసిన ఓ ప్రయోగాత్మక చిత్రమిది. అయితే, భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే కాస్త డివైడ్ టాక్ వినిపించింది. విజయ్ తన పాత్ర కోసం పడిన కష్టం, డెడికేషన్ బాగున్నప్పటికీ, సినిమా పరంగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఈ డివైడ్ టాక్ సినిమా కలెక్షన్ల… -
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
Rashmika: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ అండ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల ప్రేమాయణం ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కింది. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలుగా ఈ జంట నటించిన లేటెస్ట్ చిత్రం ‘రణబాలి’ ఈ వీకెండ్లోనే థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో తెగ బిజీగా గడుపుతున్న ఈ క్రేజీ జంట.. తాజాగా తమ సీక్రెట్ పెళ్లి ప్రపోజల్ వెనుక జరిగిన అసలు కథను బయటపెట్టి అభిమానులకు పెద్ద… -
Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
Bathukamma 2026: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక, పూల పండుగ బతుకమ్మ ముగింపు వేడుకలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. సద్దుల బతుకమ్మ సంబరాల కోసం చారిత్రక ట్యాంక్‌బండ్ తీరం అద్భుత శోభను సంతరించుకోగా, ఈసారి వేడుకల్లో సరికొత్త గ్లామర్, అంతకుమించిన క్రేజ్ తోడవ్వనుంది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరూ కలిసి ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుండటం ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ… -
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో రాహుల్ సంకృత్యాయన్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ రష్మిక మందన్న సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ చేసిన కామెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం బ్రిటీష్ వాళ్లపై జరిగిన స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదని, దీని వెనుక అంతకుమించిన బలమైన భావోద్వేగాలు ఉన్నాయంటూ రష్మిక సినిమా… -
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ లెక్కలు, నెంబర్ గేమ్ గురించి విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..… -
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
Mythri Ravi: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సంతోషంలో తాజాగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని, ఆయనకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. “ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ గారి ‘డ్రాగన్’ షూటింగ్ జరుగుతోంది. అంతకుముందు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు.. ‘రణబాలి’ సినిమాకు అదిరిపోయే రిపోర్ట్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!