ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Exposes Android Malware: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ షాకింగ్ నిజం చెప్పింది. చైనాకు చెందిన ఓ ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దాదాపు 13 లక్షల డివైజ్‌లలో కావాలనే మాల్వేర్ను ఇన్స్టాల్ చేసి బాట్‌నెట్‌ను క్రియేట్ చేసినట్లు గూగుల్ తేల్చింది. దీనివల్ల యూజర్లకు తెలియకుండానే వారి ఇంటర్నెట్ కనెక్షన్‌ను, డివైజ్‌లను ఇతరులు వాడుకుంటూ వచ్చారని స్పష్టం చేసింది. చైనాలోని షెంజెన్‌కు చెందిన ‘వీడియోస్ట్రాంగ్ టెక్నాలజీ’ (Videostrong Technology) అనే కంపెనీ ఈ పనికి పాల్పడింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్‌లలో ఈ మాల్వేర్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీ యూజర్ల ప్రమేయం లేకుండానే, నేరగాళ్లకు వారి ఇంటర్నెట్ వాడకానికి పర్మిషన్ ఇచ్చేసింది. కేవలం ఆర్థిక లాభాల కోసమే ఈ బ్యాక్‌డోర్, బాట్‌నెట్‌ను తయారు చేసి డివైజ్‌లలో ఇన్స్టాల్ చేసినట్లు గూగుల్ తన బ్లాగ్‌పోస్ట్‌లో స్పష్టం చేసింది.
ఇది ఏదో ఒక ఉద్యోగి చేసిన పొరపాటు వల్ల జరిగింది కాదు.. కావాలనే పక్కా ప్లాన్‌తో చేసిన మోసం అని గూగుల్ తేల్చింది. దీంతో ఇకపై వీరు సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ డివైజ్‌లను తయారు చేయడానికి లేదా విక్రయించడానికి వీల్లేకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ సేవలను కూడా నిలిపివేసింది. ఈ వీడియోస్ట్రాంగ్ టెక్నాలజీ అనేది ఒక ఓఈఎం (OEM), ఓడీఎం (ODM) కంపెనీ. అంటే కస్టమర్ల కోసం ప్రొడక్ట్స్ తయారు చేయడంతో పాటు సొంతంగానూ బ్రాండ్స్ తయారు చేస్తుంటుంది. 2011లో ఏర్పాటైన ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో, కోటికి పైగా ఇళ్లలో ఉన్నట్లు వారి వెబ్సైట్ చెబుతోంది.
Also Read
- ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
- WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
- Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
- రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
అసలు ఈ బాట్నెట్ అంటే ఏంటి?
హ్యాకర్లు మాల్వేర్ ద్వారా ఇన్ఫెక్ట్ చేసిన డివైజ్‌ల నెట్‌వర్క్‌ను తమ గుప్పిట్లోకి తీసుకోవడాన్ని బాట్నెట్ అంటారు. ఇలా ఇన్ఫెక్ట్ అయిన ఫోన్లు లేదా బాక్స్‌లను యాడ్ ఫ్రాడ్స్, డేటా చోరీ చేయడం, ఇతర మాల్వేర్లను ఎక్కించడానికి వాడుకుంటారు. ఈ మాల్వేర్ ఎక్కువగా ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్‌లలోనే ఉన్నప్పటికీ, టెలిహెల్త్ డివైజ్‌లు, కరాటోకే మెషీన్లు, డిజిటల్ సైనేజ్ సిస్టమ్‌లలో కూడా బయటపడింది. ప్రస్తుతం ఈ బాట్‌నెట్‌ను కంట్రోల్ చేస్తున్న సర్వర్లు, డొమైన్లను అడ్డుకోవడానికి గూగుల్ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంది. ఇలాంటి బాట్నెట్ కేసులు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో జర్మనీ అధికారులు ‘బ్యాడ్బాక్స్’ (BadBox) పేరుతో ఉన్న ఒక బాట్‌నెట్‌ను బ్లాక్ చేశారు. దానివల్ల కూడా లక్షలాది ఆండ్రాయిడ్ డివైజ్‌లు దెబ్బతిన్నాయి. అలాగే ‘Vo1d’ అనే మరో బాట్నెట్ కూడా దాదాపు 16 లక్షల ఆండ్రాయిడ్ టీవీలను ఇన్ఫెక్ట్ చేసిన చరిత్ర ఉంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
-
Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!