Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో రాహుల్ సంకృత్యాయన్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ రష్మిక మందన్న సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ చేసిన కామెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం బ్రిటీష్ వాళ్లపై జరిగిన స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదని, దీని వెనుక అంతకుమించిన బలమైన భావోద్వేగాలు ఉన్నాయంటూ రష్మిక సినిమా అసలు కోణాన్ని బయటపెట్టారు. రష్మిక మాట్లాడుతూ.. “నిన్నటిదాకా ఎడిటింగ్ లోనే టీమ్ అందరూ చూసుకున్నారు తప్ప, నేను ఒక ఆడియన్‌లా ఫుల్ సినిమా చూడలేదు. నిన్ననే విజయ్, అమ్మ, నాన్న అందరితో కలిసి మొదటిసారి చూశా. సాధారణంగా నా సినిమాలైనా సరే, నేను నటించానన్న విషయాన్ని మర్చిపోయి బయటి ప్రేక్షకురాలిలా చూస్తాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒక్కటే.. ఇది కేవలం బ్రిటిష్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మాత్రమే కాదు. అంతకుమించి ఆకలి, బతుకు తెరువు, ప్రేమ, తమ ఉనికి కోసం పోరాడిన ఒక మనిషి ప్రయాణం. మన హక్కుల కోసం, మన వాళ్ల కోసం నిలబడాలనే స్పూర్తిని నింపే కథ ఇది” అని వివరించారు.
కథలో తన పాత్ర గురించి ప్రస్తావిస్తూ.. “షూటింగ్ సమయంలో సీన్ చేశాక నేను మానిటర్ దగ్గరకు వెళ్లి చూడను. డైరెక్టర్ రాహుల్ ఓకే అంటే నాకు ఓకే అనేదాన్ని. నిన్న థియేటర్లో చూస్తుంటే జయమ్మ, రణబాలి ట్రాక్ చాలా స్వీట్‌గా, క్యూట్‌గా అనిపించింది. నటులు ఎంత చేసినా దర్శకుడు రాసే రాత బాగున్నప్పుడే ఆ పాత్రలు ప్రాణం పోసుకుంటాయి. అందుకు రాహుల్‌కు థాంక్స్ చెప్పాలి” అని అన్నారు. ఈ చిత్రాన్ని ఫ్యామిలీస్‌తో కలిసి చూడాలని రష్మిక ప్రత్యేకంగా కోరారు. “ఇది ఏదో ఒక ఏజ్ గ్రూప్‌కి పరిమితమైన సినిమా కాదు.. పూర్తిగా కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం. సినిమా అయిపోయాక అమ్మ, నాన్నలు మనకు పాత తరం నాటి ఎన్నో కథలు చెప్తారు. అంత గొప్ప అనుభూతిని ఈ చిత్రం ఇస్తుంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది” అంటూ రష్మిక సంతోషం వ్యక్తం చేశారు.
Also Read
- Vijay Deverakonda: 'కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం'
- Mythri Ravi: 'తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం'
- Nagarjuna: 'పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే'
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!