Ranabaali : బుకింగ్స్‌తో సత్తా చాటుతున్న ‘రణబాలి’.. విరోష్’కు స్పెషల్ మైల్ స్టోన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన హ్యాట్రిక్ మూవీ ‘రణబాలి’. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా విజయ్ చేసిన ఓ ప్రయోగాత్మక చిత్రమిది. అయితే, భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే కాస్త డివైడ్ టాక్ వినిపించింది. విజయ్ తన పాత్ర కోసం పడిన కష్టం, డెడికేషన్ బాగున్నప్పటికీ, సినిమా పరంగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఈ డివైడ్ టాక్ సినిమా కలెక్షన్ల మీద పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. దసరా పండుగ సెలవులు కావడం ‘రణబాలి’కి బాగా కలిసొచ్చింది. దీనికి తోడు విజయ్ – రష్మిక (విరోష్) జోడీకి ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ సినిమా బుకింగ్స్‌ను స్ట్రాంగ్‌గా నిలబెట్టింది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ జంటను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ నమోదవుతున్నాయి.
ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. విజయ్, రష్మికల కెరీర్ లో, వారి వ్యక్తిగత జీవితంలో ‘రణబాలి’ ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, వీళ్ళిద్దరి పెళ్లి తర్వాత కలిసి నటించి, విడుదలైన మొట్టమొదటి సినిమా ఇదే. ఇదిలా ఉంటే, ఈ స్టార్ జంట రీసెంట్గా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. పెళ్లి తర్వాత తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను పాటించాలని తాను రష్మికకు ముందే చెప్పానని విజయ్ అనగా.. వివాహం తర్వాత తనకిదే తొలి బతుకమ్మ పండుగ అని రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. ఇలా బయట బతుకమ్మ వేడుకలు, థియేటర్లలో పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ కావడంతో విరోష్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. మొత్తానికి డివైడ్ టాక్‌ను దాటుకుని కాంబో క్రేజ్, హాలిడేస్ అడ్వాంటేజ్‌తో ‘రణబాలి’ సేఫ్ జోన్ వైపు అడుగులేస్తోంది.
Also Read
- Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
- Dheeraj Mogilineni : "ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి"..సమ్మర్ హాలిడేస్' నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
- Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సెన్సేషన్
- Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
-
Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
-
SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
-
Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ
-
Dheeraj Mogilineni : “ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి”..సమ్మర్ హాలిడేస్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!