జంతు ప్రేమికురాలిగా గుర్తింపు పొందిన యాంకర్ రష్మి గౌతమ్, కుక్కల సమస్యపై ఇటీవల జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. రేణు దేశాయ్‌తో కలిసి సోమవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో రష్మి తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే, సమాజంలో జంతువుల పై జరుగుతున్న హింసల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహిళల వస్త్రధారణపై ఇటీవల జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. ‘మన సంస్కృతి కేవలం బట్టల వద్దే ఆగిపోయింది’ అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. సంస్కృతి అంటే…