Rare earths: ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘‘రేర్ ఎర్త్ మూలకాల’’ జపం చేస్తోంది. చైనా, అమెరికా, భారత్ ఇలా ప్రతీ దేశానికి ఈ అరుదైన మూలకాలు కావాలి. ఇప్పుడు, ప్రపంచాన్ని శాసించేది ఇదే. మన సెల్ ఫోన్ నుంచి టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్స్, రాకెట్లు, మిస్సైల్స్ ఇలా ప్రతీ దాంట్లో ఈ అరుదైన మూలకాల అవసరం ఉంది.
Rare Earth Elements: ఎలక్ట్రానిక్స్, పర్మినెంట్ అయస్కాంతాలు, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్, బ్యాటరీలు, టచ్ స్క్రీన్ల వంటి వాటి తయారీలో “రేర్ ఎర్త్ ఎలిమెంట్స్”గా పిలుబడే భూమిలో అత్యంత అరుదుగా లభించే మూలకాలు కీలకంగా మారాయి. అయితే, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతుల్లో ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఎగుమతుల్ని ఈ దేశమే నియంత్రిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సేకరణ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి జితేంద్ర…
US-China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భారీ సుంకాలను విధించుకుంటున్నారు. తాజాగా, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా నిలిపేసింది. ఇవి ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్లు, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీకండక్టర్‌ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు.
Rare Earth Elements Reserve In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన మూలకాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు పరిశోధించగా అక్కడి నేలల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్నట్లు వెల్లడించారు.