రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఏ విషయంలో అయినా ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని, నువ్ ఏం ఇక్కడ మైసూర్ మహారాణివి కాదు అని మండిపడ్డారు. పోలీసులను అడగడానికి వెళ్లిన ప్రజలపై ఎందుకు కేసులు పెట్టావ్ అని ప్రశ్నించారు. హామీల అమలపై ప్రశ్నించిన జనాలకు చెప్పులు చూపిస్తావా?, ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్ష నేతగా అడిగితే చెప్పు తెగుద్ది అంటావా? అని…
తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సీఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని తెలిపారు. టీడీపీ పతనావస్థకు చేరింది... ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. టీడీపీ ఏమి చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు.
Rapthadu Heat: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు తోపుదుర్తి చందు, రాజశేఖర్ రెడ్డిలపై సీకే పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీకే పల్లికి చెందిన మరికొందరు వైసీపీ నాయకులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త గంటాపురం జగ్గుపై దాడి చేసిన వైసీపీ నాయకులపై బెయిలబుల్ కేసులు, అక్రమ అరెస్ట్ బాధితుడు జగ్గుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సీకే పల్లి…