రావు గోపాలరావు కొన్నిసార్లు ఎస్వీ రంగారావును తలపిస్తారు. మరికొన్ని సార్లు నాగభూషణాన్ని గుర్తుకు తెస్తారు. కానీ, ఎవరు మరచిపోలేనట్టుగా తన బాణీని పలికిస్తారు. అదీ రావు గోపాలరావు ప్రతిభ. ఆయన లేని లోటు తెలుగు చిత్రపరిశ్రమకు తీరనిలోటు అని బాధపడేవారు ఈ నాటికీ ఎందరో ఉన్నారు. కాలం కొత్తనీటికి తావిస్తూ పోతుందని అంటారు. ఎంత పాతనీరు పోయినా, ఇంకా గోపాలరావు నటన నిత్యనూతనంగానే నిలచింది. ఇంతవరకూ రావు గోపాలరావును మరిపించిన వారు కనిపించలేదు. రావు గోపాలరావులోని ప్రతిభకు…