భూ నిర్వాసితుల కోసం త్వరలో 72 గంటల దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రైతులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని బండరావిరాల, చిన్నరావిరాల సర్వే నెం.268లో భూమిని కోల్పోయిన రైతులు తమకు నష్టపరిహారం ఇవ్వాలని కొన్ని నెలలుగా చేస్తున్న పోరాటానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు.. గతంలో భూనిర్వాసితులకు మద్దతుగా…
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు పడింది… విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కమిషనర్ ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వివరించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా, షాద్‌నగర్ లోని రాంనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. పనుల కోసం ఫరూఖ్‌నగర్ మండలపరిధిలోని ఉప్పరిగడ్డ గ్రామానికి చెందిన శ్రీను, కృష్ణ, రాజు సోమవారం కూలీ పనుల నిమిత్తం తమ కుటుంబసభ్యులతో కలిసి షాద్‌నగర్‌కు వచ్చారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో భాగంగా పైప్…
ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన తొలి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో విజయవంతం కావడంతో.. అదే ఊపుతో మరో సభకు సిద్ధమైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ… ఇంద్రవెల్లి బహిరంగసభ వేదికగానే.. ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నంలో తర్వాతి సభ ఉంటుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు.. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించడం.. ఇతర కారణాలతో ఆ వేదిక కాస్తా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి షిఫ్ట్ అయిపోయింది.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని…