ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పుష్పక విమానం’.. గీత్ సైని కథానాయికగా నటిస్తుండగా.. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ లోగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ‘సిలకా’.. అనే పాట లిరికల్ వెర్షన్ రిలీజ్ చేశారు. తాజాగా ‘కల్యాణం..’ అంటూ సాగే మరో లిరికల్ సాంగ్‌ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత…