ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె సీఎం పదవిని చేపట్టారు. రామ్‌లీలా మైదానంలో ప్రజల సమక్షంలో రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమం జరిగింది.
ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీయే నేతల సమక్షంలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మర్లేనా తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్న నాలుగో మహిళగా ఆమె నిలవనుంది.
ఎల్లుండి రాంలీల మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది.
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం ముమ్మరం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యకతిరేకంగా దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహిస్తుంది.