Rameshwaram Cafe: బెంగళూర్‌లో ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తి రెస్టారెంట్‌లో బ్యాగ్ వదిలిసి వెళ్లాడు. అందులో ఉన్న బాంబు పేలినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధ్రువీకరించారు. ఐఈడీని పేల్చేందుకు టైమర్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.
Rameshwaram Cafe: బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌లో ఈ రోజు మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బాంబు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ధృవీకరించారు. ప్రముఖ ఫుడ్ జాయింట్‌గా ఉన్న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో 9 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. బాంబ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్, డాగ్ స్వ్కాడ్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
Rameshwaram Cafe Blast: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వర్ కేఫ్‌లో పేలుడు ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ముగ్గురు సిబ్బంది కాగా.. మరొకరు కస్టమర్. అయితే, ఈ పేలుడు సిలిండర్ వల్ల జరగలేదని, దానికి బాంబు పేలుడు కారణం కావచ్చని బీజేపీ బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య అనుమానం వ్యక్తం చేశారు.
Rameshwaram Cafe: బెంగళూర్ నగరంలో ప్రముఖ రెస్టారెంట్‌గా పేరొందిన రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని వైట్‌ఫీల్డ్ లోని రామేశ్వరం కేఫ్‌లో సంభవించిన పేలుడులో కనీసం నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురు సిబ్బంది ఉండగా..ఒకరు కస్టమర్. ప్రాథమిక నివేదిక ప్రకారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బ్యాగులో ఉంచిన వస్తువు పేలినట్లుగా