రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టాడు డైరెక్టర్ రమేష్ వర్మ. రీమేక్ చేసినా కూడా ఒరిజినల్ ఫ్లేవర్ ని మిస్ అవ్వకుండా రాక్షసుడు సినిమా చేసిన రమేష్ వర్మ… తరుణ్ హీరోగా నటించిన ఒక ఊరిలో అనే సినిమాతో దర్శకుడిగా మారి 2009లో వచ్చిన నాని-తనీష్ నటించిన రైడ్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు రమేష్ వర్మకి హిట్ అనే మాటే తెలియదు. మాస్ మహారాజా రవితేజ ‘వీర’ సినిమా…