దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మే 13తో యాభై రోజులు పూర్తి చేసుకుంది. తొలి నుంచీ భారీ అంచనాలతో అందరినీ ఊరిస్తూ వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మార్చి 25న జనం ముందు నిలచింది. మొదటి నుంచీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో ఈ యేడాది తెలుగులో భారీ వసూళ్లు చూసిన చిత్రంగా నిలచింది ‘ట్రిపుల్ ఆర్’. హైదరాబాద్ ఆర్టీసీ…
ఏమది? ఎంతటి ఆశ్చర్యం!? దక్షిణాదిన నేడు తెలుగు సినిమారంగంతో పోటీ పడే స్థితి ఎవరికీ లేదే? అటువంటిది ఓ కన్నడ పాన్ ఇండియా మూవీ మన తెలుగు క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ రికార్డును అధిగమించుటయా!? ఎంతటి విడ్డూరమూ! రాజమౌళి భారీ ప్రాజెక్ట్ గా విడుదలైన ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఉత్తరాదిన మంచి వసూళ్ళు చూసిందని ఇటీవల హిందీ రైట్స్ తీసుకున్న వారు ముంబయ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాను కూడా ఆహ్వానించి, తమ ఆనందం పంచుకున్నారు.…
రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ విజయవంతం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. చిత్తూరు జిల్లాలో అభిమానం వెల్లువెత్తింది. కుప్పం పట్టణం గుడ్ల నాయన పల్లి గ్రామపంచాయతీ లోని ఊరి నాయన పల్లి గ్రామంలో నందమూరి తారకరామారావు అభిమానులు ఆర్.ఆర్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా వారి గ్రామంలో కొత్తగా జెండాను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు బాబులకే బాబు …తారక్ బాబు కాబోయే ముఖ్యమంత్రి తారక్ బాబు… అంటూ నినాదాలు చేశారు.…
సినీ అభిమానులందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సమయం రానుంది. ఎన్నో ఏళ్లుగా ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఎదురుచూపులు తెరపడింది. ఎన్నో వాయిదాల తరువాత ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకతవంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్…
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని రచ్చ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉందో చెప్పుకొచ్చాడు. మారుతున్న…
వివిధ పాలనా, సాంకేతిక పరమయిన కారణాల వల్ల ఆగిపోయిన ట్రూజెట్ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈనెల 5 వ తేదీ నుంచి ట్రూజెట్ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషంగా వుందని కంపెనీ వెల్లడించింది. ఈనెల 23వ తేదీ బుధవారం నుంచి వివిధ సెక్టార్లలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది. హైదరాబాద్-విద్యానగర్-హైదరాబాద్ విద్యానగర్-బెంగళూరు-విద్యానగర్ బెంగళూరు-బీదర్-బెంగళూరు హైదరాబాద్-రాజమండ్రి-హైదరాబాద్ హైదరాబాద్-నాందేడ్-హైదరాబాద్ ముంబై-నాందేడ్-ముంబై ముంబై-కొల్హాపూర్-ముంబై ముంబై-జలగావ్-ముంబైఈ రూట్లలో ట్రూజెట్…
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మూవీ ప్రమోషన్లు జోరుగా నడుస్తున్నాయి. ఈ రోజు విడుదలైన ట్రైలర్ గురించి రివ్యూలు, సినిమా కథ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రామ్‌చరణ్-ఎన్టీఆర్ నటన.. ఇలా పలు అంశాల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే విషయంపైనా పలువురు ఆసక్తిగా…
టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో మెగా వారసుడు రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు స్నేహితులలానే కనిపిస్తూ ఉంటారు. మెగా కొసలు ఉపాసన అందరికి తలలో నాలుకగా మారి కొణిదెల ఇంటి పేరు నిలబెడుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరు ఈ జంటను అడిగే ప్రశ్న పిల్లలను ఎప్పుడు కంటారు అని.. వీరి పెళ్ళై ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతుంది.. ఇప్పటివరకు వీరి నుంచి గుడ్ న్యూస్…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం “ఆర్సి 15”. ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్‌లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. సునీల్, అంజలి, నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. 170 కోట్లకు పైగా…