RRR: ఓటీటీలోనూ దుమ్ములేపుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్, శ్రియాశరణ్, అజయ్‌దేవ్‌గణ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లూరిగా రామ్‌చరణ్, భీమ్‌గా ఎన్టీఆర్ ఆయా పాత్రల్లో ఒదిగిపోగా.. రాజమౌళి తెరకెక్కించిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ చిత్రం. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది.
అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డు కొట్టినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఆర్‌ఆర్‌ఆర్ హిందీ డబ్బింగ్ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి నేటి వరకూ 45 మిలియన్ అవర్స్ ఆర్‌ఆర్‌ఆర్ స్ట్రీమింగ్ అయిందట. అలా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అలాగే ఈ మూవీ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Also Read
- OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
- BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్
- Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. 'మా ఇంటి బంగారం 2' అధికారికంగా ప్రకటించిన రాజ్
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
తాజావార్తలు
-
Vivo Y6a: మార్కెట్ లోకి వివో Y6a.. 7200 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
-
BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!