బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఈరోజు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ తొలి సెషన్ ఈరోజు రాయ్‌పూర్‌లో ప్రారంభమైంది. 71 ఏళ్ల రమణ్ సింగ్ ఆదివారం స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఛత్తీస్‌గఢ్ విధానసభలో అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్లడం తన కొత్త బాధ్యత అని అన్నారు.
Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్న మొత్తం ఛత్తీస్‌గఢ్‌లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు అరడజను మందికి పైగా బీజేపీ నేతలు సీఎం రేసులో ఉన్నారు. కానీ ఏ ఒక్క పేరును ఎవరూ ఫిక్స్ చేయలేరు.
Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు 223 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరి భవితవ్యాన్ని 40 లక్షల 78 వేల 681 మంది ఓటర్లు తేల్చనున్నారు.
రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆధీనంలోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌లో కుంభకోణం, చిట్ ఫండ్ సంస్థల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపించాలని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు.