NCP: శ్రీ రాముడిని ఉద్దేశించి ఎన్సీపీ(శరద్ పవార్) నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. నాసిక్‌లోని షిర్డీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జితేంద్ర అవద్ చేసిన కామెంట్స్‌పై బీజేపీ ఫైర్ అవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరి ప్రతిష్టాపన కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు అవద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని ప్రేరేపించాయి.