దేశ అత్యున్నత పదవి, రాజ్యంగ అత్యున్నత పదవిని స్వీకరించబోతున్నారు ద్రౌపది ముర్ము. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా సోమవారం పదవిని స్వీకరించనున్నారు. 21 గన్ సెల్యూల్స్ మధ్య పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10.15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని..
Vice President Election : రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతుగా నిలిచింది టీఆర్ఎస్. హైదరాబాద్ వచ్చిన యశ్వంత్‌కు ఘన స్వాగతం పలికింది కూడా. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కూడా ముగియడంతో… ఇక తేలాల్సింది ఫలితాలే. ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల హడావుడి మొదలైంది. NDA తరఫున జగదీప్ ధనఖడ్ బరిలో ఉంటే.. విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్‌కు చెందిన మార్గరెట్ ఆళ్వా నామినేషన్ వేశారు. దీంతో టీఆర్ఎస్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.…
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దేశంలోని ప్రధాన పార్టీలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు దేశాధ్యక్షుడి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసేసుకున్నాయి. కానీ.. ఇప్పటి వరకు టీడీపీ నిర్ణయం ఏంటన్నది బయటకు రాలేదు. పార్లమెంటులో.. అసెంబ్లీలో పెద్దగా ప్రభావం చూపని స్థితిలో టీడీపీ సభ్యులు ఉన్నారు. జగన్‌కు జైకొట్టగా మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశానికి ఉన్నారు.…
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ ను నియమించారు. ఇంతకు ముందు ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర పదవి కాలం నేటితో ముగుస్తుండటంతో కొత్త నియామకం చేపట్టారు. మే 15 నుంచి రాజీవ్ కుమార్ నియామకం అమలులోకి రానుంది. ముగ్గురు సభ్యులు ఉండే పోల్ ప్యానెల్ లో సుశీల్ చంద్ర…
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. అయితే పీవీ సింధు 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలవగా.. ఈ ఏడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సింధుకు 2015లో పద్మశ్రీ అవార్డు దక్కింది. అయితే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం…