Ram Mandir : రామమందిర ప్రతిష్టకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తిలకించేందుకు అయోధ్యకు చేరుకుంటున్నారు. కానీ విమానాలు, రైళ్లు, హోటళ్లు నిండిపోవడంతో ప్రజలు అయోధ్యకు వెళ్లేందుకు మార్గం దొరకడం లేదు. మీరు డబ్బు ఖర్చు లేకుండా ఉచితంగా అయోధ్య చేరుకోవచ్చు. ఎలాగా అని ఆలోచిస్తున్నారా. మీకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే మీకు ఎలా వెళ్లాలో చెప్తాము. మొబైల్ వాలెట్ కంపెనీ Paytm ఉచిత బస్ టిక్కెట్లను ఇస్తామని ప్రకటించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు సులభంగా అయోధ్య చేరుకోవచ్చు. Paytm ఈరోజు నుండి ఉచిత బస్సు సేవలను ప్రారంభించింది.