నవరత్నాలు కూడా రాళ్ళే! కాకపోతే, ఖరీదైన రాళ్ళు. నవ్వితే నవరత్నాలు రాలే వరం ఎలాంటిదో తెలియదు కానీ, రాళ్ళపల్లి నవ్వుల్లో నవరత్నాలు రాలినట్టే ఉండేది. హాస్యనటునిగా అంతలా ఆకట్టుకున్నారు రాళ్ళపల్లి. తనదైన వాచకంతో, తన ఆంగికానికి తగ్గ అభినయంతో రాళ్ళపల్లి వందలాది చిత్రాల్లో నవ్వులు పూయించారు. ఒకప్పుడు పీలగా ఉంటూ నవ్వించిన రాళ్ళపల్లి కాలచక్రం కదలికల్లో బాగా బొర్రపెంచేశారు. ఆ బొజ్జతోనే నవ్వులు పూయించి మెప్పించారు. ఎక్కువగా నవ్వించినా, కొన్ని చిత్రాల్లో కవ్వించారు, మరికొన్నిట కన్నీరు పెట్టించారు,…