Pakistan Woman Sends Rakhi For PM Modi: పాకిస్తాన్ మహిళ మరోసారి ప్రధాని మోదీకి రాఖీ పంపించింది. కమర్ మోహ్సీన్ షేక్ ప్రధాని మోదీకి రాకీ పంపింది. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ విజయం సాధించాలని కోరుకుంది. ఈ సారి ప్రధాని మోదీని కలిసేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నానని ఆమె వెల్లడించారు. ఈ సారి ప్రధాని మోదీ తనను ఢిల్లీ పిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎంబ్రాయిడరీ డిజైన్ తో కూడిన రేష్మీ రిబ్బన్…
అన్నాచెల్లెళ్ళ అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కుతున్న సినిమా ‘రక్షాబంధన్’. అక్షయ్ కుమార్, భూమీ ఫడ్నేకర్ జంటగా ఈ సినిమా ఆనంద్ ఎల్. రాయ్ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. హిమాన్షు శర్మ, కనికా థిల్లాన్ సహ రచయితలుగా వ్యవహరిస్తున్న ‘రక్షాబంధన్’ను తన సోదరి హీరానందాని కి డెడికేట్ చేస్తున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపాడు. ఇందులో సహెజ్ మీన్ కౌర్, దీపికా ఖన్నా, సదియా ఖతీబ్, స్మృతి శ్రీకాంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2020 ఆగస్ట్ 3 రక్షాబంధన్ సందర్భంగా…
రక్షాబంధన్ రోజుల అన్నయ్యలకు అక్కచెల్లెళ్లు రాఖీలు కడతారు. అన్ని విధాలుగా అన్న తోడుగా ఉంటాడు అని చెప్పడానికి గుర్తుగా రాఖీని కడతారు. అయితే, బీహార్ అక్కడి ప్రభుత్వం గత కొన్ని సంవత్సారాలుగా రాఖీ పండుగ రోజున సీఎంతో సహా అనేకమంది మంత్రులు అధికారులు చెట్లకు రాఖీలు కడుతున్నారు. రక్షాబంధన్ రోజును వృక్షరక్షాబంధన్ దివస్ పేరుతో చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడేందుకు అక్కడి నితీష్ కుమార్ ప్రభుత్వం 2012 నుంచి ఈ కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా…
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయ్. తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీ సీఎం జగన్‌కు మహిళలు రాఖీలు కట్టారు. రాజకీయ నేతలకు మహిళా నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ నివాసంలో రాఖీ వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి..శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. అటు…విజయవాడలో రాఖీ వేడుకలు జరిగాయి. సీఎం జగన్‌కు పలువురు మహిళలు రాఖీలు కట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. “రక్షాబంధన్” పండుగ సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. సోదరీమణులు తమ సంతోషం, శ్రేయస్సు కోసం రాఖీ రోజున సోదరుల నుదుటిపై బొట్టు పెట్టి స్వీట్లు తినిపిస్తారు. అలాగే అన్నాదమ్ములు కూడా తమ సోదరీమణులకు గిఫ్ట్ లు…
సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తోడబుట్టిన అక్క చెల్లెళ్లకే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా అండగా నిలవడం మన కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెబుతోందని.. కానీ ఈ రోజు గౌరవప్రదమైన మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారే మహిళలతో అగౌరవంగా మాట్లాడుతుండటం మన దురదృష్టమన్నారు.…
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం గా సిఎం తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు సుఖ శాంతులతో ఉండాలని సీఎం…