పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణ అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించడంపై…ఆమె అత్త, ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించి…కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కామెంట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్ ఛైర్ ఉద్దేశించి…మీ నుంచి మేము న్యాయం కావాలంటున్నామని…అధికార పార్టీ సభ్యుల నుంచి కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని జయాబచ్చన్ హెచ్చరించారు.…
పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ బీసీ జనగణన అంశం పై మాట్లాడారు. బీసీల సమస్యలను సభకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే.. కానీ బలహీనులు కాదన్నారు. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవడం లేదన్నారు. సామాజిక వెనకబాటు ఉన్న వారికి రిజ్వేషన్లు అందేలా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. Also Read: సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలి: వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భారత దేశంలో…
సుప్రీం కోర్టు బెంచ్ పెడితే భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచడానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని, ఆర్టికల్ 130 ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయొచ్చని సూచించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేవలం నలుగురు (9 శాతం),…
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎన్నో భయాలు.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు.. ఇక, ఆ తర్వాత క్రమంగా వ్యాక్సిన్‌వైపు పరుగులు పెట్టారు జనం.. కానీ, అప్పుడు వ్యాక్సిన్లు దొరకని పరిస్థితి.. గంటల తరబడి లైన్లలో వేచిచూడాల్సిన దుస్థితి.. ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెట్టి.. వ్యాక్సిన్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఎన్నో.. క్రమంగా ఆ పరిస్థితి పోయింది.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.. వ్యాక్సిన్ సెంటర్లలోనే…
రైతు సమస్యలపై పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తూ వస్తోంది టీఆర్ఎస్ పార్టీ… ముఖ్యంగా తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.. ఇక, తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఉభయసభల నుంచి ఇవాళ వాకౌట్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇవాళ ఆరో రోజు కూడా ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు టీఆర్ఎస్ ఎంపీలు.. లోకసభలో స్పీకర్ పోడియాన్ని…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆందోళన చేస్తూ వస్తున్న తెలంగాణ ఎంపీలు.. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు.. లోక్‌సభలో ధాన్యం సేకరణపై మాట్లాడిన ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత ఐదు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నామని తెలిపారు.. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నాం.. రైతు బంధు ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి… ఇవాళ్టి వరకు సమావేశాలు చాలా వేడి వాడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా రైతుల సమస్యలే ఫోకస్ గా విపక్షాలు ప్లారమెంట్ లో నిరసనలు తెలుపుతున్నాయి. ఇక ఇవాళ్టి రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా… నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎంపీలు. ఈ నేపథ్యంలో.. ఇవాళ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు.. స్పీకర్ పొడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని.. కేంద్రానికి వ్యతిరేకంగా..…
సామాన్యుడి నడ్డి విరిచేలా.. ప్రతీ వస్తువుపై ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో భారం పడేలా పెట్రో ధరలు వరుసగా పెరిగిపోయాయి.. అయితే, దీపావళికి ముందు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్రం.. ఆ తర్వాత క్రమంగా బీజేపీ పాలిత, ఎన్డీయే పాలి రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి.. అంతే కాదు.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కూడా తగ్గించాల్సిందేనంటూ ఒత్తిడి పెరిగుతోంది.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు.. అయితే,…
ప్రస్తుతం కరోనా అదుపులో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ అన్నారు. ఇందుకు సంబంధించి ఇవాళ రాజ్య సభలో ఒమిక్రాన్ వేరియంట్ చర్చకు వచ్చింది. అసలు కేసులు ఉన్నాయ అని సభ్యలు ప్రశ్నించారు. ఈ మేరకు రాజ్యా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని రాజ్యాసభలో స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.…
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. ఇక, ఈ కొత్త వేరియంట్‌పై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో మాట్లాడిన ఆయన… ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామని, పాజిటివ్…