పులస దొరకడం అరుదు.. ఇది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది.. రుచికి పెట్టింది పేరు.. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్నారంటే.. దానికి ఉన్న ప్రత్యేక ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవటానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకొని…