Vijay: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో ఉన్న తమిళ సమస్యల్ని లెవనెత్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) దివంగత చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన, ప్రభాకరన్‌పై ప్రశంసించడం సంచలనంగా మారింది. దేశ ప్రజలు శ్రీలంక తమిళుల గొంతుక కావాలని పిలుపునిచ్చారు.
ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోనీ లివ్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, కుకునూర్ మూవీస్‌తో కలిసి, ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన పుస్తకం నైంటీ డేస్ ఆధారంగా ‘ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు’ అనే ఉత్కంఠభరిత పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌ను ప్రేక్షకులను అందించనుంది. జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో.. రోహిత్ బనవాలికర్, శ్రీరామ్ రాజన్‌తో కలిసి ఈ సిరీస్‌ను రూపొందించారు. Also Read : Dhanush: రేయ్ ధనుష్…
Rajiv Gandhi Assassination convicts leaves jail: సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న నళిని శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు తమిళనాడు వేల్లూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు శ్రీహరన్, సంతన్, మురుగన్, రాబర్ట్ పాయస్, ఆర్పీ రవిచంద్రన్ విడుదలైన వారిలో ఉన్నారు. 31 ఏళ్ల పాటు నిందితులు జైలు శిక్ష అనుభవించారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పుతో వీరందరికి ఊరట లభించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై…
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్ సహా మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్‌ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయగా.. దీనిని ఉదహిరిస్తూ నళిని సుప్రీం కోర్డు మెట్లెక్కారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.. ఆ కేసులో దోషిగా ఉన్న పేరారివాలన్ 31 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో 31 ఏళ్లుగా జైలు జీవితం గడిపిన యావజ్జీవ ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. నళిని శ్రీహరన్, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్‌తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు ఈ…