‘మత్తు వదలవరా, తెల్లవారితే గురువారం’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘దొంగలున్నారు జాగ్రత్త’ మూవీలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా శ్రీ సింహా హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ కొత్త చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరు పెట్టారు. గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఎ సాయి కొర్రపాటి…