సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా నటన నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు రజనీ స్వయంగా “అన్నాత్తే” చిత్రం సిబ్బందితో తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చర్చించారట. రజినీ ఇటీవలే “అన్నాత్తే” చిత్రీకరణను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తయ్యాక సిబ్బందితో లొకేషన్‌లో మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ ప్రణాళికను వెల్లడించారని సమాచారం. రజనీకాంత్ 1975 నుండి సినిమాల్లో నటిస్తున్నారు.…