జమ్మూ & కశ్మీర్‌లో ఉగ్రమూక మరోసారి రెచ్చిపోయింది. ఓ స్కూల్ టీచర్‌ను మంగళవారం కాల్చి చంపారు. సాంబకు చెందిన రజినీ బాలా (36).. కుల్గాం జిల్లాలోని గోపాల్‌పొర ప్రాంతంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. ఇవాళ ఉదయం ఆమెపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రజినీ బాలా పని చేస్తోన్న హైస్కూల్‌లోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని…