Rangareddy crime: రాజేంద్ర నగర్‌లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపిన విషయం మరువక ముందే.. మరో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులే కావడంతో రాజేంద్ర నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ డాక్టర్స్ కాలనీలో 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్ కి గురయ్యాడు. ఇంట్లోనే ఆడుకుంటున్నాడని భావించిన తల్లిదండ్రులు ఇంట్లో వెతగ్గా చిన్నారి ఎక్కడా కనిపించాలేదు. బయటకు వచ్చి చూసిన ఫలితం కనిపించకుండా పోయింది. అయితే కొందరు ఆటోలో చూసినట్లు తెలుపడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ ఆటోలో వెళ్లినట్లు తెలుపడంతో.. సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు. తన కొడుకును వెంటనే తమ దగ్గరకు చేర్పించాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read also: Dasara: వెన్నెల డాన్స్ ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంది మాష్టారు…
ఇక ఇలాంటి మరోఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ లో చోటుచేసుకుంది. గాయత్రి అనే యువతి మిస్సింగ్ కలకలం రేపింది. బజార్ కు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన యువతి రాత్రి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువులకు ఫోన్ చేసి వకాబు చేయగా ఎక్కడా తమ కూతురు ఆచూకీ తెలియక పోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి బజార్ కు వెళతానని చెప్పిన గాయత్రి వారి స్నేహితల ఇంటి వెళ్లిందా? లేక గాయాత్రిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు ఉన్న యువతులు, చిన్నారుల కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కవ మిస్సింగ్ కేసులు రావడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న ఫలితం లేకుండా పోతోంది. పోలీసుల తీరుపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇలా రోజుకో మిస్సింగ్ కేసులు నమోదు అవతున్న పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న చిన్నారుల, యువతుల జాడను తెలుసుకోలేపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగారెడ్డి జిల్లాలో పోలీసుల పహారా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Mughals Out Of Syllabus: సీబీఎస్ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు..