Ranga Reddy Crime: చికెన్ కోసం వెళ్లాడు.. ప్రాణాలు కోల్పోయాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranga Reddy Crime: అతివేగం ప్రమాదకరం అని రోడ్డులపై ప్రమాద సూచికలు పెట్టినా అవి బోర్డుమాత్రమే పరిమితం అవుతున్నాయి. అతివేగంగా వాహనాలను నడిపి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తొందరగా రావాలనే తాపత్రయంతో లేక త్వరగా వెళ్లాలనే ఆత్రుతతో మృత్యు ఒడికి జారుకుంటున్నారు. ఆదివారం కుంటుంబం కోసం చికెన్ తీసుకువచ్చేందుకు బయలు దేరాడు. ఇంట్లో వండుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా తిందామని అనుకున్నాడు. ఉదయాన్నే లేచి చికెన్ కోసం బైక్ పై వెళ్లాడు. అయితే ఓ ఘటన తన జీవితాన్ని అతలాకుతలం చేసింది. చికెన్ కోసం
బైక్ పై వెలుతున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న ఆటో వేగంగా ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది.
Read also: Fake Customer Care Scam : గూగుల్‌లో హోటల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా..? మీరు మోసపోయినట్లే..?
Also Read
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరమైసమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దర్గాఖలీజ్ ఖాన్ గ్రామానికి చెందిన అంజి ఆదివారం కావడంతో చికెన్ తీసుకొని వస్తానని మోటర్ సైకిల్ పై బయలుదేరాడు. అటుగా వస్తున్న ఆటో అంజి బైక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో అంజి కింద పడ్డాడు. బలంగా తలకు గాయం కావడంతో అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదానికి కారణం అయిన ఆటోను ధ్వంసం చేసారు. రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం మితిమీరిన వేగమే అంటున్నారు.
Potato Peels : బంగాళాదుంప తొక్కే కదా అని తీసేస్తే..?
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!