రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతమని, ఈరోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని… “కలయిక ఫౌండేషన్” అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం…
ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ తనయుడు శ్రీకమల్ 'జిలేబి' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా చివరి రెండు పాటల చిత్రీకరణ బ్యాంకాక్ లో పూర్తయ్యింది.
అలనాటి 'లేడీస్ టైలర్' జంట ఇప్పుడు 'షష్టి పూర్తి' సందర్భంగా మరోసారి ఒక్కటైంది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రాబోతున్న 'షష్టిపూర్తి' చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్ కుమార్, ఆకాంక్షసింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Rajendra Prasad: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీతో నవ్వించడమే కాదు.. తన నటనతో కన్నీళ్లు కూడా పెట్టించగలడు. ప్రస్తుతం సపోర్టివ్ క్యారెక్టర్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు' చిత్రం మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసింది.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు మాటల రచయితగానూ మారిపోయారు. తన తాజా చిత్రం 'ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు'కు ఆయనే సంభాషణలు సమకూర్చుకున్నారు. ఈ సినిమా మార్చిలో జనం ముందుకు రాబోతోంది.
సరిగా ముప్పై ఐదేళ్ళ క్రితం వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ – ముగ్గురూ వర్ధమాన కథానాయకులుగా అలరిస్తున్నారు. వెంకటేశ్ అప్పుడప్పుడే ఆకట్టుకుంటున్నారు; అర్జున్ తనదైన యాక్షన్ తో అలరిస్తున్నారు; ఇక రాజేంద్రప్రసాద్ నవ్వుల పువ్వులు పూయిస్తూ సాగుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే అది తప్పకుండా జనాన్ని ఇట్టే కట్టిపడేసేలా ఉండాలి కదా! అందుకోసం హిందీలో ఘనవిజయం సాధించిన ‘నసీబ్’ను ఎంచుకున్నారు నిర్మాతలు టి.సుబ్బరామిరెడ్డి, పి.శశిభూషణ్. వారి ‘మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కిన తొలి…