Sasana Sabha: ఎమ్మెల్యే నారాయణస్వామిగా రాజేంద్రప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendra Prasad Playing MLA Narayana Swamy Role In Sasanasabha: ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘శాసనసభ’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. కన్నడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా పేరుపొందిన తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆగస్టు 15 ఇండిపెండేన్స్ డే సందర్భంగా సోమవారం విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో పోషించనటువంటి విభిన్నమైన పాత్ర ఇది. చిత్రంలో ఈ పాత్ర ఎంతో హైలైట్‌గా వుంటుంది. మా చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బసుర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఆయన నేపథ్య సంగీతంతో విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన దక్కింది. చిత్రం కూడా తప్పకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది” అని అన్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!