ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఆరు వికెట్లకు 286 పరుగులు చేసింది. 287 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 242 పరుగులకే పరిమితమైంది. 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ధ్రువ్…
ఈరోజు ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. రెండు జట్లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేతిలో ఉంది. హైదరాబాద్ పగ్గాలు పాట్ కమ్మిన్స్ చేతిలో ఉన్నాయి. రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ 14 ఓవర్లలోనే 200 స్కోర్ పూర్తి చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
SRH vs RR: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. నేడు ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 3:30కి సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక మ్యాచ్ టాస్ లో భాగంగా.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. దానితో సన్ రైజర్స్…
హైదరాబాద్ క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరణం రానే వచ్చింది. ఉప్పల్ లో తొలి మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు సన్‌రైజర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. నేడు ఉప్పల్ వేదికగా మ.3:30కి సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ 17వ సీజన్ లో రన్నరప్ గా నిలిచిన…
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ సంజు శాంసన్ ఈ ఎడిషన్‌లో రాజస్థాన్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు సారథ్యం వహించడని ఆర్ఆర్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఫిట్నెస్ సమస్య కారణంగా కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడని పేర్కొంది. శాంసన్ స్థానంలో స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ‘ఐపీఎల్ 2025లో సంజు శాంసన్ మొదటి మూడు మ్యాచ్‌లలో బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడు. ఫిట్నెస్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) కోసం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టులో చేరారు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతని చూపుడు వేలుకు గాయమైంది. దీంతో.. క్రికెట్ అభిమానులు ఈ సీజన్‌కు దూరమవుతాడని భావించినప్పటికీ.. గత నెలలో విజయవంతమైన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో తన జట్టుతో కలిసి ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు.
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఇప్పటికే ఐపీఎల్ పాలక వర్గం అనుమతించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఉంటుంది. రిటైన్ జాబితాను ప్రకటించడానికి అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నా.. ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకుందని…
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. పదవీకాలం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ ఎన్నికైన విషయం తెలుసు. అయితే.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా సెలక్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ శుక్రవారం ప్రకటించింది.
Rahul Dravid Likely to Return Rajasthan Royals as Head Coach: టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన విషయం తెలిసిందే. ద్రవిడ్ మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి ఎంట్రీ ఇస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని మెంటార్‌గా లేదా కోచ్‌గా తీసుకోవడానికి చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు కోచ్‌గా…