RR vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ఆరవ మ్యాచ్ గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ఈ సీజన్ లో రెండు జట్లు మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో, ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాయి. ఇక నేడు మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సునీల్ నరైన్ అనారోగ్యంగా కారణంగా మ్యాచ్ కు దూరం కావడంతో, అతని స్థానంలో మొయిన్ అలీ జట్టులోకి వచ్చాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఫారూకీ బదులు హసరంగ జట్టులోకి వచ్చాడు. ఇక ఇరుజట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో పేరుకే ఆరు రుచులు.. లాభాలేమో అనేకం!
కోల్‌కతా నైట్ రైడర్స్ (Playing XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రసెల్, రమన్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
రాజస్థాన్ రాయల్స్ (Playing XI): యశస్వి జైస్వాల్, సంజూ సాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మయేర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.